Monday, April 21, 2025
Homeజిల్లాలుఅనంతపురంగర్భిణీ లకు పౌష్టికాహారం పంపిణి

గర్భిణీ లకు పౌష్టికాహారం పంపిణి

విశాలాంధ్ర – శెట్టూరు : ఏదైనా సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన కలగడంతో స్నేహితులందరూ కలిసి ప్రతినెల శెట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భవతులు చికిత్సల కోసం వస్తున్న వారు ఇబ్బందులకు గుర్తించి గర్భవతులకు పోషక ఆహారం పంపిణీ క చేపట్టడం చాలా సంతోషమని డాక్టర్ తరుణ్ సాయి పేర్కొన్నారు బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ ఉపాధ్యాయులు బద్దే నాయక్, అబ్దుల్ వహాబ్, హాజరై అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గర్భవతుల చికిత్స నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భవతులు ఒపీ పేషెంట్ ప్రతినెల దాదాపుగా వందమంది దాకా వారందరికీ సంవత్సరం నుంచి మంచి పోషకాలతో కూడిన ఆహారం అందించడం చాలా గొప్ప విషయమని వారు అన్నారు హెల్పింగ్ హాండ్స్ సభ్యులు గత సంవత్సరం ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటికీ సంవత్సరం పూర్తి చేసుకోవడం సంతోషకరమని మీ స్నేహితులందరికీ కలిసి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం అని వారు కి అభినందనలు తెలియజేశారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైనవాటిని కూడా సహాయం చేయడానికిముందుంటామని మాకు సహరిస్తున్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కమిటీ సభ్యులు లేపాక్షి,బాబు, సుకేష్, సత్యనారాయణ, వీరేష్, నవీన్,మహేష్, బాలరాజ్, రఘు ఆశ వర్కర్లు వివిధ గ్రామాల గర్భవతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు