విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని జీవి ఈ జెడ్పి గర్ల్స్ హై స్కూల్ నందు ఒకేషనల్ విద్యపై పదవ తరగతి విద్యార్థులకు గత కొన్ని రోజులుగా అవగాహన కార్యక్రమాన్ని వృత్తి విద్య అధ్యాపకురాలు కళ్యాణి, అనూష నిర్వహించారు. తదుపరి ఈ ఒకేషనల్ విద్యపై అవగాహన పూర్తి అయిన తర్వాత శిక్షణ పొందిన విద్యార్థినీలకు సర్టిఫికెట్స్ ను పాఠశాల హెడ్మాస్టర్ సుమన చేతులు మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ ఒకేషనల్ విద్యపై మాకు చక్కటి అవగాహన కలిగిందని, ఇది మాకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడేటట్లు శిక్షణ ఇచ్చిన టీచర్లకు హెడ్మాస్టర్ కు కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు పాల్గొన్నారు.
ఒకేషనల్ విద్యా సర్టిఫికెట్లు పంపిణీ.. హెడ్మాస్టర్ సుమన
RELATED ARTICLES