విశాలాంధ్ర-తనకల్లు : మండల పరిధిలోని ZPHS బొంతలపల్లి పాఠశాలలో 23 మంది విద్యార్థులకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నిష్ణాతులైన ఉపాధ్యాయులచే రూపొందించబడిన SSC మెటీరియల్ విద్యార్థులకు అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటునందించిన దాత S వెంకట రమణకు పలువురు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సుండుపల్లి గణేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణగా విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తమ కుటుంబ పరిస్థితులను మననం చేసుకొని బాగా చదువుకొని తల్లిదండ్రులకు సమాజానికి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ZPHS బొంతాలపల్లి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని , ఉపాద్యాయులు మరియు మండల యూటీఎఫ్ నాయకులు P. శివ శంకర్ రెడ్డీ తదితరులు పాల్గొన్నారు