విశాలాంధ్ర ధర్మవరం ; రాష్ట్ర పార్టీ పంపిన తెలుగుదేశంపార్టీ సభ్యత కార్డులను, ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా నాయకులు, బూతుల వారిగా నియోజకవర్గంలో గల నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు.ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమతంకాటమయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర్మవరం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో 65 వేల సభ్యత్వలు నమోదు చేపట్టడం జరిగిందని, ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసం ఉంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల,పట్టణ,గ్రామ, వార్డు స్థాయిలో గల నాయకులందరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీని పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ఆయన కోరారు. పార్టీ సభ్యత నమోదు తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెదేపా సభ్యత్వ కార్డుల పంపిణీ
RELATED ARTICLES