Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లాస్థాయి జూనియర్ బాలుర, సీనియర్ ఉమెన్స్ హ్యాండ్ బాల్ జట్లు ఎంపిక…

జిల్లాస్థాయి జూనియర్ బాలుర, సీనియర్ ఉమెన్స్ హ్యాండ్ బాల్ జట్లు ఎంపిక…

జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి సాకే శివశంకర్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని యశోద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జిల్లా స్థాయి జూనియర్ బాయ్స్, సీనియర్ వుమన్ హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించడం జరిగింది అని జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి సాకే శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి దాదాపు 100కు పైగా క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని, ఈనెల 21, 22, 23వ తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు, కర్నూలులో జరుగుతాయని తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు వైఎస్సార్ ఎంటర్ప్రైజెస్ ప్రోపరేటర్ చంద్రశేఖర్ టీ షర్ట్స్ ను వారి సొంత ఖర్చుతో అందరికీ అందజేశారు అని తెలిపారు. అలాగే జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రియాజ్ క్రీడాకారులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యశోద స్కూల్ డైరెక్టర్ పృథ్వీరాజ్, వైఎస్సార్ ఎంటర్ప్రైజెస్ చంద్రశేఖర్, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు