Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు..

జిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు..

హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, హాకీ శ్రీ సత్య సాయి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బంధనాదం సూర్యప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, శ్రీ సత్య సాయి జిల్లా హాకీఅసోసియేషన్ కార్యదర్శి బంధనాదం సూర్య ప్రకాష్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఎంపికైన సీనియర్ పురుషుల జట్టు హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 2025-మార్చి నెలలో గుంటూరులో జరిగే 15వ రాష్ట్రస్థాయి సీనియర్ హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపిక పోటీలలో పాల్గొని సీనియర్ క్రీడాకారులు 01-01-1991 తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. కావున ఆసక్తి గల క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రావలెనని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు