విశాలాంధ్ర ధర్మవరం;; గత ప్రభుత్వంలో మమ్ములను ఆపరేటర్లుగా నియమించడం జరిగిందని, ఇప్పుడున్న ఎం డి ఏ ప్రభుత్వం తొలగించడం వల్ల మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, మా సమస్య ప్రభుత్వానికి తెలిపి న్యాయం చేయాలని ఎండి యూ ఆపరేటర్ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరెడ్డి ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం అగ్రిమెంట్ ప్రకారం 2021 జనవరి నుండి 2027 జనవరి వరకు ఉందని, అటువంటప్పుడు మమ్ములను తొలగించడం అన్యాయమని తెలిపారు. ప్రజలకు ఇంటి వద్దనే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నామని, అటువంటి అప్పుడు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా మమ్ములను ప్రభుత్వం తొలగించడం సమంజస మేనా? అని వారు ప్రశ్నించారు. మమ్ములను తొలగించడం వలన తాము ఉపాధి కోల్పోయి మా కుటుంబం వీధిన పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం పునరా ఆలోచన చేసి మాకు ఉన్న వ్యవధి వరకు మా ఉద్యోగాలు కొనసాగించేలా చూడాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిళ్ళ శివ, బాబావలి ,రంగస్వామి, దామోదర్, రాజేంద్ర నాయక్, సహదేవ రెడ్డి, శంకర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎం డి యు ఆపరేటర్లకు న్యాయం చేయండి… జిల్లా అధ్యక్షులు ప్రతాపరెడ్డి
RELATED ARTICLES