Homeఅంతర్జాతీయం‘ఇంకా అయిపోలేదు’.. ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

‘ఇంకా అయిపోలేదు’.. ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

హర్మూజ్‌ తెరుచుకున్నా చర్యలు ఆగవని స్పష్టీకరణ
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య ముగిసిపోయిందని భావించవద్దని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకున్నా.. ఇరాన్‌పై సైనిక చర్యకు పూర్తిగా తెరపడలేదని స్పష్టం చేశారు.తాజా ఘర్షణల తర్వాత ఇరాన్‌ తీవ్ర ఆర్థిక, సైనిక ఒత్తిడిలో ఉందని ట్రంప్‌ అన్నారు. సైన్యానికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ సామర్థ్యం బాగా తగ్గిపోయిందని తెలిపారు.ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరిపే ఆలోచన లేదని కూడా ట్రంప్‌ తేల్చిచెప్పారు. హర్మూజ్‌ జలసంధి తెరుచుకోవడం ఒక ముఖ్యమైన పరిణామమేనని, అంతమాత్రాన సైనిక చర్యలు ముగిసినట్లు కాదని అన్నారు.ఇరాన్‌పై తదుపరి సైనిక చర్య ఎప్పుడు ఉంటుందనే విషయంపై మాత్రం ఆయన వివరాలు వెల్లడించలేదు. ఎలాంటి పరిస్థితుల్లో మరోసారి దాడులకు దిగుతారో కూడా చెప్పలేదు.ఇరాన్‌తో సంబంధాల విషయంలో రష్యాపై చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ట్రంప్‌ స్పందించారు. హర్మూజ్‌ జలసంధి అంశంలో ఇప్పటివరకు రష్యా బాగానే వ్యవహరించిందని చెప్పారు. అయితే ఇరాన్‌తో రష్యా సంబంధాలపై తమ అంచనా ఏంటో స్పష్టం చేయలేదు.ఇరాన్‌, ఒమన్‌ మధ్య ఉన్న హర్మూజ్‌ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలక మార్గం. గల్ఫ్‌ దేశాల నుంచి భారీగా చమురు, సహజవాయువు ఈ మార్గం గుండా అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు