Monday, February 10, 2025
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్, రష్యా యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారు. సైనికులతో పాటు సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోయారు. నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారాయి. మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పరిష్కరించే విషయంపై త్వరలో తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడతానని తెలిపారు.ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్ తనతో మాట్లాడాలని అనుకుంటున్నారని, త్వరలోనే చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఇదివరకే తాను జెలెన్‌స్కీతో చాలాసార్లు మాట్లాడినట్లు తెలిపారు. వారు యుద్ధాన్ని ఆపాలని అనుకుంటున్నారని చెప్పారు. పుతిన్ కూడా ఇదే కోరుకుంటున్నారని భావిస్తున్నానని అన్నారు. ఈ విషయంలో తాము సహాయం చేస్తామని తెలిపారు. ఇదే క్రమంలో తన మొదటి విదేశీ పర్యటన గురించి ట్రంప్ వెల్లడించారు. బ్రిటన్ లేదా సౌదీ అరేబియాకు తన తొలి విదేశీ పర్యటన ఉండవచ్చని ట్రంప్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు