డి.ఎస్.పి హేమంత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందనీ డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో రక్తదాన శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. కన్నా వెంకటేష్ చేసిన ఈ సేవలు ఎంతో మందికి స్ఫూర్తి కావాలని తెలిపారు. పోలీస్ శాఖ తరపున మా వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా ఉంటాయని తెలిపారు. అనంతరం కన్నా వెంకటేష్ మాట్లాడుతూ యువత సహకారంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 28 మంది రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం పలుమార్లు నిర్వహిస్తున్నామని, రక్తదాన శిబిరానికి స్పందన రావడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్, ఎస్సై గోపి కుమార్, కౌన్సిలర్ కేతా లోకేష్, డాక్టర్ నరసింహులు, చంద్రశేఖర్, నాగరాజు, జయప్రకాష్, ఉదయ్ కుమార్, నాగరాజు, విష్ణు, నరేంద్ర, శివయ్య, శంకర ,వీరప్ప పాల్గొన్నారు.
రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుంది..
RELATED ARTICLES