Wednesday, April 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినిరాశ్రయులకు అన్నదానం.. పరబ్రహ్మ స్వరూపంతో సమానం...

నిరాశ్రయులకు అన్నదానం.. పరబ్రహ్మ స్వరూపంతో సమానం…

రజిని ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం:: నిరాశ్రయులకు, వృద్ధులకు, ఆకలిగొన్న వారందరికీ అన్నదానం చేయడం పరబ్రహ్మ స్వరూపంతో సమానమని రజనీ ట్రస్టు రక్త బంధం ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో ఆకలిగొన్న 50 మందికి పులిహోర ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ ను పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అని పెద్దలు అన్నారని, అన్నదానం అన్ని దానాలలో గొప్ప అని తెలిపారు. మనకున్న దానిలో కొంతమేరకు దానం చేయడం అందరూ అలవర్చుకోవాలని, కుటుంబంలోని పిల్లలకు కూడా ఈ అలవాటు చేయాలని తెలిపారు. దాతల సహాయ సహకారములతోనే ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ఆసక్తి గల దాతలు కూడా ముందుకు రావాలని వారు కోరారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిశేషు, శంకర, జయ శంకర, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు