విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయి నగర్ లో గల షిరిడి సాయిబాబా దేవాలయమునకు పట్టణంలోని తబ్జుల్ రవి ప్రకాష్ వారి కుటుంబ సభ్యులు వినాయక ముఖ కవచమును తయారుచేసి ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ తాము ఈ బాబా గుడికి ఇవ్వాలన్న తలంపుతోనే భక్తిగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వినాయక వెండి కవచములు 360 గ్రాములు, విలువ 42 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వీరనారాయణ, నారాయణ రెడ్డిలు దాతల పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా సత్కరించారు.
సాయిబాబా దేవాలయమునకు వినాయక ముఖ కవచం విరాళం ఇచ్చిన దాతలు
RELATED ARTICLES