Saturday, March 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅధైర్య పడవద్దు.. ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకుంటుంది

అధైర్య పడవద్దు.. ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకుంటుంది

పంట నష్టపోయిన రైతుల కన్నీరు తుడిచిన పరిటాల శ్రీరామ్

గాలి, వానలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన శ్రీరామ్

3.53లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర తాడిమర్రి/ధర్మవరం : అకాల వర్షం, వడగండ్ల వానకు పంటలు కోల్పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల్లో తాడిమర్రి మండలంలో వడగండ్లు, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. దాడితోట పంచాయతీలోని దాడితోట, తురకవారిపల్లి, నాయనపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను కలుసుకొని దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. 252 ఎకరాల్లో అరటి, 2ఎకరాల్లో తమలపాకు, 5ఎకరాల్లో దానిమ్మ తోటలు దెబ్బతిన్నాయని తెలుసుకున్నారు. మొత్తం 120మంది రైతులకు నష్టం వాటల్లినట్టు అధికారులు చెప్పారు. ఇందులో పెద్ద వీరనారప్ప 4ఎకరాల్లో అరటి పంట సాగు చేయగా.. ఆదివారం నుంచి కోతలు చేయాల్సి ఉందన్నారు. మొత్తం 50టన్నుల దిగుబడి రాగా.. టన్ను 16వేల చొప్పు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరింది. ఇంతలోనే వడగండ్ల వర్షానికి పంట దెబ్బతిందని వీరనారప్ప కన్నీరు పెట్టుకున్నారు. అలాగే నాగమునెమ్మ 3ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేయగా.. వడగండ్ల వర్షానికి పంట మొత్తం పోయిందని శ్రీరామ్ వద్ద కన్నీరు పెట్టుకుంది. బాధిత రైతులను శ్రీరామ్ ఓదార్చారు. ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ అకాల వర్షాలు, వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు దెబ్బతినడం చాలా బాధాకరమన్నారు. ఏ రైతును కదిలించినా కన్నీరు వస్తోందన్నారు. ఈ పంట నష్టంపై ఇప్పటికే రెవెన్యూ, హార్టీకల్చర్ అధికారులు అంచనాలు వేస్తున్నారన్నారు. ఇందులో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా నివేదికలను పంపాలని అధికారులను కోరారు. కచ్చితంగా బాధిత రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని శ్రీరామ్ స్పష్టం చేశారు…

ముగ్గురికి 3.53లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్

వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ముగ్గురికి పరిటాల శ్రీరామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. తాడిమర్రి మండలం దాడితోటలో పంట నష్టాన్ని చూసేందుకు వెళ్లిన సమయంలో ముగ్గురికి ఈ చెక్కులు అందించారు. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన మల్లేసుకు 25వేలు, చిన్నచిగుళ్లరేవు గ్రామానికి చెందిన వీరారెడ్డికి 45వేలు, తాడిమర్రి గ్రామానికి చెందిన చింతమ్మకి 2.82లక్షల చొప్పున మొత్తం 3లక్షల 53వేల రూపాయలు సాయం అందజేశారు. చెక్కులు అందుకున్న వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎంత సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉందన్నారు. ఆరోగ్య శ్రీ వర్తించని వారికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా అదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు