Thursday, April 3, 2025
Homeజిల్లాలుకర్నూలుదివ్యాంగులను అగౌరవపరచవద్దు

దివ్యాంగులను అగౌరవపరచవద్దు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : దివ్యాంగులను ఎవరూ కూడా అగౌరవపరచ కూడదని ఉపాధ్యాయులు నర్సింహులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రాథమిక మెయిన్ పాఠశాలలో మండల విద్యాధికారులు సువర్ణల సునియం, రామ్మూర్తి ఆధ్వర్యంలో ప్రపంచ మూగవ్యాధి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఎక్కడ ఉన్నా గౌరవించాలని, వారిలోని ఒంటరి తనాన్ని పోగొట్టి సమాజంలో ఉన్నతంగా చూడాలన్నారు. వారిని అడ్డపేర్లతో పిలవరాదని, వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. పిల్లలలో మూగవ్యాధిని గుర్తించి సమస్య పరిష్కారం కోసం వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భవిత సెంటర్ కు వచ్చే విద్యార్థులకు రవాణా, స్టైఫండ్, ఎస్కార్ట్, హోం బేస్డ్ మొదలగు సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కేశవ, మల్లికా బేగం, సహిత ఉపాధ్యాయులు ఎర్రకోట గోపాల్, సుబ్బారాయుడు, ఆయాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు