Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయరాదు.. డీఎస్పీ హేమంత్ కుమార్

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయరాదు.. డీఎస్పీ హేమంత్ కుమార్

విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం సబ్ డివిజన్లో విధులు నిర్వర్తించే ప్రతి పోలీస్ కుటుంబం ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయరాదని, ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో ఉచిత గుండె వైద్య శిబిరమును డి.ఎస్.పి హేమంత్ కుమార్ నిర్వహించారు. ఈ శిబిరంలో కిమ్స్ సవేరా హాస్పిటల్ వివిధ విభాగాల వైద్యుల పర్యవేక్షణలో పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య చికిత్సలను అందించడం జరిగింది. ఈ శిబిరంలో జి ఆర్ బి ఎస్/బిపి/ఈసీజీ/2 డి ఈకో ఉచితంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ కుటుంబ సభ్యులతో పాటు పాత్రికేయ కుటుంబ సభ్యులు కూడా పాల్గొని కిమ్స్ సవేరా హాస్పిటల్ వైద్యులచే వైద్య చికిత్సలను పొందడం జరిగింది. అనంతరం దాదాపు 200 మందికి వైద్య చికిత్సలను అందించడం జరిగిందని డిఎస్పి తెలిపారు. ధర్మవరం సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్సైలు, ఏఎస్ఐలు, హోంగార్డులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఇటువంటి శిబిరాలు నిర్వహించడం పట్ల పోలీస్ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడిందని సబ్ డివిజన్ పోలీసులు తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సబ్ డివిజన్లోని పోలీసుల కుటుంబాలు పాల్గొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు