Thursday, January 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులను చదువుల పేరుతో ఒత్తిడి చేయవద్దు

విద్యార్థులను చదువుల పేరుతో ఒత్తిడి చేయవద్దు

వారికి చదువుతో పాటు క్రీడలు కూడా అంతే ముఖ్యం

ఆర్డీటీ అది గుర్తించి.. క్రీడల్ని ప్రోత్సహిస్తోంది

హాకీ పోటీల ముగింపు కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులను చదువుల పేరుతో ఒత్తిడి చేయవద్దని వారికి చదువుతోపాటు క్రీడలు కూడా అంతే ముఖ్యము అని ధర్మవరం టిడిపి నియోజకవర్గం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీటీ మైదానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంతర్ జిల్లా జూనియర్ ఉమెన్ హాకీ ఛాంపియన్ షిప్ పోటీలు ముగిసాయి. ఆర్డీటీ డా.విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ పేరుతో నిర్వహించిన ఈ పోటీలు 13వ సారి కావడం విశేషం అని తెలిపారు.ఈ పోటీల్లో మొత్తం 17టీంలు పాల్గొంటే, నాలుగు టీంలు సెమీ ఫైనల్స్ కి వచ్చాయి అని తెలిపారు. ఫైనల్ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా విజేత నిలిచిందన్నారు. అనంతరం పరిటాల శ్రీరామ్ విజేతలను, రన్నర్స్ ను అభినందించారు. వారికి బహుమతులు కూడా ప్రధానం చేశారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ గత 20ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయం అన్నారు. కేవలం హాకీ మాత్రమే కాకుండా గత మూడు దశాబ్ధాలుగా ఎంతో మంది క్రీడాకారులను అందించిందన్నారు. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో చాలా మార్పులు రావాలని.. పిల్లలకు చదువులతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమన్నారు. క్రీడల్లో పాల్గొంటే శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. అది చదువుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడు ఓడిపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం 17టీంలు పాల్గొంటే.. టాప్-4కి రావడం అంత ఈజీ కాదన్నారు. మీరు క్రీడల్లో చూపిన పోరాట స్ఫూర్తిని జీవితంలో కూడా చూపించాలని అన్నారు. అలాగే జీవితంలో పది మందికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఇలాంటి అవకాశాలను కల్పిస్తున్న ఆర్డీటీ సంస్థ భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు