సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్
విశాలాంధ్ర అనంతపురం : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రూపకర్త దేశ మహిళలకు సమాన హక్కులు కల్పించినటువంటి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి జగదీష్ కొనియాడారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి అన్ని కులాలకు జాతీయ సంపదలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సోమవారం స్థానిక జడ్పీ హాల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, గుంటకల్ లో స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ డి జగదీష్ మాట్లాడుతూ … దేశంలో జనగణన ……కాదు కులగనున చేపట్టాలని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను వ్యతిరేకిస్తూ
ఈరోజు వాడవాడలా గ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి అని పేర్కొన్నారు. కులాల్లో చైతన్యం పెరిగిందంటే అందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు పోగొట్టి సమానత్వం తీసుకురావాలని ఆశించిన ఆశయాలు అయితే, ఈ దేశంలో అన్ని కులాల వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఎదగాలని చేసినటువంటి మహా గొప్ప నాయకుడు అన్నారు. అందరికీ సమాన హక్కులు రావాలని లౌకిక దేశంలో ఈ లౌకికంగా పునాదులపై ఏర్పడిన మతాలలో, కులాల్లో సమానత్వం ఉండేలా, ఈ దేశంల సమగ్రంగా ఉండాలంటే మరి అన్ని కులాలు కావలసినటువంటి ఆర్థిక సమానత్వం తీసుకొని రావాలని ఆశించి ఆయన భారత రాజ్యాంగంలో రాయడం జరిగిందన్నారు. దళితులు, ఆదివాసులు, వెనుకబడిన వర్గాలు మైనార్టీలు సామాజికంగా రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ఎందుకంటే ఉన్నత వర్గాలకు సమానంగా ఈ రిజర్వేషన్ ద్వారా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుదలకు రిజర్వేషన్లు ఉపయోగపడతాయని అంబేద్కర్ భావించాడన్నారు. ఉద్యోగ అవకాశంలో గానీ, రాజకీయంలో పదవులు గాని ఆర్థిక ఆశయాలలో గాని అన్ని విషయాల్లోనూ ఉండాలని ఆ మహానుభావుడు ఆలోచించాడు కానీ ఈరోజు అంబేద్కర్ ఆశించిన ఆశయాలను పూర్తిగా సఫలీకృతం కాలేదన్నారు. సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, అంబేద్కర్ ఆశయాలు ను పూర్తిగా నెరవేరాలి అంటే దేశంలో కుల గణన చేపట్టాలన్నారు. ఈ కుల గణన చేపట్టడం ద్వారా దేశంలో ఏ కులం ఎంత ఉందో, ఎంతమంది ఉన్నారు, ఎంత సంఖ్యలో ఉన్నారు అనే విషయాన్ని నివేదిక ద్వారా తెలియజేయాల్సిందన్నారు. దేశంలో వచ్చేటువంటి జాతీయ సంపద అయితే అందరికీ భాగస్వామ్యం ఉంటుందో ఆ యొక్క జాతీయ సంపదను ఏ విధంగా పంపకాలు చేయాలో, ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ కులగణాల ద్వారా ఏ కులాలు వారికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని విషయాలు కూడా ప్రభుత్వానికి నిర్దేశం చేస్తుందన్నారు. ఈరోజు కర్ణాటక ,తెలంగాణలో కుల గణన పూర్తిచేసి వారు కూడా రిజర్వేషన్లు తెలంగాణలో 48% అదే విధంగా కర్ణాటకలో 52% వెనుకబడిన వర్గాలకు ఇస్తున్నామని తెలియజేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లో కులగణలో జరగాలి అని అన్నారు. దేశవ్యాప్తంగా జన గణన కాదు. కుల గణన చేయాలని ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మనమందరం ప్రతిజ్ఞ చేయాలన్నారు. అదేవిధంగా కుల గణాలు చేసి జాతీయంలో వచ్చినటువంటి సంపదను కార్పొరేటర్ శక్తులకు ఇవ్వరాదన్నారు. ఈ దేశంలో కులాలైతే మతాలైతే ఉన్నాయో వారికి జాతీయ పంపకాలు చేయవలసింది కానీ ,ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆదానికీ, అంబానికి జాతీయ పంపకం సరైంది కాదన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్క కులాలకు సంపదను పంచాలి జాతీయ సంపదలో ఎవరైతే ఉంటారో ప్రతి కులానికి ప్రతి మతానికి ఇవ్వాల్సిందే అలా ఇవ్వకుంటే కుల గణన చేసినప్పుడే, అంబేద్కర్ ఆశయాలకు రాజ్యాంగ రచించినందుకు పరిపూర్ణం అవుతుందన్నారు. దీనికోసం రాష్ట్రా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కులగణాలపై పోరాటానికి సిపిఐ పార్టీ కుల సంఘాలను కలుపుకొని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి కొంతమంది శక్తులు తూట్లు పొడుస్తున్నారు ముఖ్యంగా రాజకీయంగా ఉన్న శక్తులు తూట్లు పొడవడానికి దేశంలో ఉన్న వివిధ మతాలు వివిధ జాతులు వివిధ కులాలు వారిని విడదీయడానికి పూనుకుంటున్నారన్నారు. దేశంలో రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి నిట్ట నిలువునా చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాటిని ఎదుర్కోవడానికి దేశ సమగ్రతను ,దేశ సమైక్యతను కాపాడుడానికి ఈరోజు వక్ఫ్ బోర్డు విషయము లో హిందూ మతం విషయంలో క్రిస్టియన్ మతం విషయంలో మత విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదునీ అందుకే మత విషయాలు అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ను రాయడం జరిగిందన్నారు. ఆ ఆర్టికల్ ను ప్రభుత్వ అనుసరించాలని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నామన్నారు . అంబేద్కర్ ఆశలను నూటికి నూరు పాలు సాధించే విధంగా సిపిఐ పార్టీ పోరాడుతుందని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి, సహాయ కార్యదర్శి బి మహేష్,పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండీ గౌస్ మండల కార్యదర్శి రాము రాయల్, మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటియుసి మండల అధ్యక్షులు తలారి సురేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దేవేంద్ర ప్రజానాట్యమండలి అధ్యక్ష కార్యదర్శులు ప్రసాదు పుల్లయ్య ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి వెంకట నాయక్… సిపిఐ శాఖ కార్యదర్శిలు దౌలా నూర్ భాషా దాసరి శ్రీనివాసులు మధు కుమార్ లంబానూర్ జి కొట్టాల శాఖ కార్యదర్శి సూర్యనారాయణ బాలకృష్ణ ములకలపెంట శాఖా కార్యదర్శి భాస్కర్ శివమ్మ ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి శివ మనీ.. తదితర నాయకులు పాల్గొన్నారు.