Tuesday, April 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియంయండిఎ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ జయంతి

యంయండిఎ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ జయంతి

విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలో యంయండీఏ ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్. బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి, అయన జయంతిని యం యం డి ఎ సభ్యుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి అని, ఎన్నో అవమానాలా తరువాత దేశం తలరాతనే మార్చే రాజ్యాంగం ని రచించిన రూప కర్త అని, విద్యను నమ్ముకున్న వారు వివేకవంతులు అని, దళితుల పాలిట దూత అని డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ గొప్పతనం గురించి వారు వివరించారు ఈ కార్యక్రమం యం యం డి ఎ నియోజకవర్గ అధ్యక్షులు దాదా పీర్, సభ్యులు జిక్రియా, రెహమతుల, ఆనంద్, నారాయణ, సమ్మి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు