Saturday, April 5, 2025
Homeజిల్లాలుఅనంతపురండా.బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని కొనసాగించాలి

డా.బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని కొనసాగించాలి

ఆయన సేవలను మనందరం గుర్తుంచుకోవాలి
డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : డా.బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందడుగు వేయలని, ఆయన సేవలను మనందరం గుర్తుంచుకోవాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్ర్య సమరయోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ లో చర్చి ఎదురుగా ఉన్న డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. జాతీయ నాయకులైన బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి, భావితరాలకి వారి ఆలోచనలను పంచడానికి కృషి చేయాలన్నారు. రాజకీయాలలో స్వాతంత్ర్యం అనంతరం తొలి క్యాబినెట్ నుంచి రాజకీయాలలో ఉన్నంతకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. రాజకీయాలలోకి రాకముందే అస్పృశ్యతను నివారించడానికి ఒక ఫోరంను ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం, దేవాలయాలలోనూ, తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం పోరాటం జరిపినటి వంటి గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పారు. వారందరి పోరాటాల ఫలితంగానే సమాజం ఈ రకమైనటువంటి మార్పులను పొందగలిగిందని, అలాంటి మహనీయుల సేవలను గుర్తు చేసుకోవాల్సిన తరణమిదన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మాట్లాడుతూ… డా.బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో, ఆదర్శంతో వివిధ ప్రభుత్వ పథకాల అమలులో అనంతపురం జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి అన్ని పథకాలు యాక్టివేట్ అయ్యాయని, వివిధ సంక్షేమ పథకాల కింద రుణాలు కూడా మంజూరు అయ్యాయని, రాబోయే మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా రుణాలను గ్రౌండింగ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలకు మేలు చేసే దాంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, డిఆర్ఓ ఏ.మాలోల, ఆర్డీఓ కేశవనాయుడు, సోషల్ వెల్ఫేర్ జెడి రాధిక, పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు