Friday, April 4, 2025
Homeజిల్లాలుఅనంతపురంకులం పుట్టుక - నిర్మూలన పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ కిరణ్ చైతన్య

కులం పుట్టుక – నిర్మూలన పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ కిరణ్ చైతన్య

విశాలాంధ్ర – శెట్టూరు (అనంతపురం జిల్లా) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంగ్లీషులో రాసిన యానిహిలేషన్ అఫ్ క్యాస్ట్ పుస్తకాన్ని తలారి మోహన్ అనువాదం చేసిన కులం పుట్టుక నిర్మూలన పుస్తకం శుక్రవారం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు ట్రస్ట్ చైర్మన్ బద్దేనాయక్, కోనసీమ జిల్లా వెటర్నరీ డాక్టర్ కిరణ్ చైతన్య, ఎమ్మెస్ రాయుడు ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కులవ్యవస్త నిర్మూలన ఎలా జరగాలో బాబాసాహేబ్ చెప్పిన మాటలు ఆయన సూచించిన విధానం గురించి తెలియజేశారు తరువాత తరానికి బాబాసాహేబ్ మాటలను చేర్చాలి బాబాసాహేబ్ మాటలు ఆయన ప్రసంగాలు ఆయన రచనలే ఈ దేశానికి ఆదర్శం ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో కుల వ్యవస్త నశించిపోడానికి బదులు పెరిగి పెద్దదై బ్రహ్మ రాక్షసి లాగా పెను ప్రమాదం గా తయారయిపోయింది. అసలు కులం ఎలా పుట్టింది? అది నిర్మూలించాలంటే ఏం చేయాలి అనేది బాబాసాహేబ్ చెప్పారు. ఆయన ఇంగ్లీష్ లో రాసిన ఈ పుస్తకం యానిహిలేషన్ అఫ్ క్యాస్ట్ అనే పుస్తకాన్ని తెలుగులో అందరికీ అర్దమయ్యే భాషలో మొహన్ తలారి అనువాదం చేశాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వాదులు, ఉపాధ్యాయులు మేధావులు ఈ పుస్తకాలు చదివి అందులో ఉన్న విషయాలు పదిమందికి చెప్పాలని వారు సూచించారు అనంతరం ప్రత్యేకంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ను సందర్శించి చైర్మన్ బద్దే నాయక్ సేవలను కొనియాడారు. ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ త్వరలోనే ట్రస్ట్ కు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధిఖారి అబ్దుల్ వాహాబ్, తిప్పేస్వామి,చిరంజీవి, ఓబులేష్ మహాలింగ, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు