Tuesday, January 7, 2025
Homeజిల్లాలుఅనంతపురండా. పతికి రమేష్ నారాయణకు శరత్ సాహితీ కళాస్రవంతి రజతోత్సవ విశిష్ట సాహితీ పురస్కారం

డా. పతికి రమేష్ నారాయణకు శరత్ సాహితీ కళాస్రవంతి రజతోత్సవ విశిష్ట సాహితీ పురస్కారం

విశాలాంధ్ర అనంతపురం : నగరానికి చెందిన ప్రముఖ రచయిత, అనువాదకులు, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పతికి రమేష్ నారాయణకు కరీంనగర్ లోని శరత్ సాహితీ స్రవంతి రజతోత్సవ విశిష్ట పురస్కారం లభించింది. డాక్టర్ పతికి రమేష్ నారాయణ అనువదించిన “అవ్వ” కావ్యానికి ఆంగ్ల అనువాదం “ది మదర్” పుస్తకానికి ఈ అవార్డు లభించింది. కరీంనగర్ లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలిదండ్ల నిత్యానందరావు, కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య భట్టు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రమేష్ నారాయణ అనువాదాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రత్యేకంగా అభినందనలు తెలిపి ఈ అవార్డుకు ఆయన ఆంగ్లానువాదం చేసిన “ది మదర్” ప్రాసస్త్యాన్ని కొనియాడారు. రమేష్ నారాయణకు విశిష్ట అవార్డు దక్కడం పట్ల శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, యూనివర్శిటీల విభాగం రాష్ట్ర కన్వీనర్ డా. బత్తల అశోక్ కుమార్, ఎస్.ఆర్. ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత సుంకర రమేష్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు