Sunday, February 23, 2025
Homeజాతీయంత్రివేణి సంగ‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పుణ్య స్నానం

త్రివేణి సంగ‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పుణ్య స్నానం

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌యాగ్‌రాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళాకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా త్రివేణి సంగ‌మంలో ఆమె ప‌విత్ర స్నానం ఆచ‌రించారు. అంత‌కుముందు రాష్ట్ర‌ప‌తి ప్ర‌యాగ్‌రాజ్ లో ప్ర‌త్యేక పూజ‌లు చేసి బోటులో విహ‌రించారు. ముందుగా యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ విమానాశ్ర‌యంలో రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికి కుంభ‌మేళాకు తీసుకెళ్లారు. ఇక ఈరోజు ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామితో పాటు తెలంగాణ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి కూడా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. ఇదిలాఉంటే.. గ‌త నెల 13న ప్రారంభ‌మైన కుంభ‌మేళా ఈ నెల 26 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. 45 రోజుల పాటు జ‌రిగే ఈ ప‌విత్ర కార్య‌క్ర‌మంలో దేశ‌, విదేశాల నుంచి సుమారు 40 కోట్ల‌ మందికి పైగా భ‌క్తులు వ‌స్తార‌ని యోగి స‌ర్కార్ అంచ‌నా వేసింది. కానీ, ఇప్ప‌టికే 35 కోట్ల‌కు పైగా మంది పుణ్య స్నానాలు ఆచ‌రించిన‌ట్లు యూపీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు