Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముదిగుబ్బ సంతలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలి..

ముదిగుబ్బ సంతలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలి..

సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం; ముదిగుబ్బ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే వారపు సంతలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలని సిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ముదిగుబ్బ పంచాయతీ కార్యాలయంలో ఇంచార్జ్ ఎంపీడీవో దివాకర్, పంచాయతీ అధికారి మంజులాదేవి, అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంత వేలంపాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శ్రీనివాసులు అధికారులతో మాట్లాడుతూ ప్రతి ఏటా సంత ద్వారా లక్షల రూపాయలు ఆదాయం వస్తున్న సంతలో కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు.వారం,వారం ఈ సంతకు పట్టణ ప్రజలే కాక ఇతర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుండడమే గాక వేల సంఖ్యలో మూగజీవాలు కూడా ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు.కాగా ఇక్కడ తాగునీటి సౌకర్యం లేకపోవడంతో మూగజీవాలతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తక్షణమే పంచాయతీ అధికారులు సంతలో శాశ్వత తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇంచార్జ్ ఎంపీడీవో దివాకర్ స్పందిస్తూ సంతలో తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గంగిరెడ్డిపల్లి నాయుడు, తిప్పయ్య, తుమ్మల చిన్నప్ప, రాధాకృష్ణ, చల్లా శంకర, ముత్తులూరి మధు , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు