విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రౌడీషీటర్లు అందరికీ డి.ఎస్.పి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ జన జీవనానికి పాఠం కలిగించిన, ఎవరైనా ఎలాంటి ఆవాజనీయ సంఘటనలకు పాల్పడిన, అసాంఘిక కార్యక్రమాలకు ప్రేరేపించిన, లేదా వాటి యందు పాల్గొనినా కూడా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగిందని తెలిపారు. చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్ప, సిబ్బంది పాల్గొన్నారు
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డి.ఎస్.పి హేమంత్ కుమార్
RELATED ARTICLES