ధర్మవరం జిఆర్పిఎస్ఐ దేవదాస్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని లక్ష్మీ నగర్ కు చెందిన పుల్లయ్య ఏకైక కుమారుడు చింతా కిరణ్(36) జీవితంపై విరక్తి చెంది, కుటుంబ సమస్యలు, వివాహం కాకపోవడం తదితర కారణాలతో గురువారం తెల్లవారుజామున గాంధీనగర్ రైల్వే గేట్- పోతుకుంట బ్రిడ్జ్ మధ్యలో రైలు కిందపడి మృతి చెందడం జరిగిందని జి ఆర్ పి-ధర్మవరం రైల్వే ఎస్సై దేవదాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు చింతా కిరణ్ చేనేత కార్మికుడిగా ఉంటూ తన తల్లిదండ్రులను చెల్లెళ్లను పోషించేవాడు. ప్రస్తుతం తల్లిదండ్రులు వృద్దులు కావడం, పెద్ద కుమార్తెకు అన్నగా వివాహం చేయడం, తెలిసిన, తెలియనిచోటల లక్షల్లో అప్పులు చేయడం జరిగిందన్నారు. తదుపరి రెండవ చెల్లెలు ఎంసీఏ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కానీ మృతుడు చింతా కిరణ్ తనకు వివాహం కాలేదని, ఆడ పాపను ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేకపోవడం, కుటుంబ సమస్యల ఆర్థిక భారం అధికం కావడంతో ఎల్లప్పుడూ తల్లిదండ్రులతో తన బాధను పంచుకునే వాడని తెలిపారు. తదుపరి ఏమి చేయాలో తోచక, జీవితం మీద విరక్తితో, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలు కిందపడి చనిపోవడం జరిగిందని తెలిపారు. జిమెయిల్ ద్వారా సమాచారం అందుకున్న జి ఆర్ పి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలిస్తూ, అక్కడ చూడడానికి వచ్చిన స్థానికులతో వారు మాట్లాడటంతో, స్థానికులు గుర్తించి మృతుని వివరాలను తెలియజేశారు. తదుపరి తల్లిదండ్రులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కుటుంబములో ఉన్న పెద్ద కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కుటుంబ సమస్యలతో చేనేత కార్మికుడు రైలు కిందపడి ఆత్మహత్య..
RELATED ARTICLES