Sunday, January 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు..

సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు..

ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గల ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు. తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం ఈనెల 20వ తేదీన ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన భోజనాన్ని పంపిణీ చేయాలని, మెరుగైన భోజనాన్ని అందించే బాధ్యత ఆయా పాఠశాలల హెడ్మాస్టర్ దేనిని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా సంక్రాంతి సెలవులు తల్లిదండ్రులు కూడా తమ విద్యార్థులను గమనిస్తూ ఉండాలని తెలిపారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడ కూడా బయటకు వెళ్ళరాదని తెలిపారు. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రుల దేనిని తెలిపారు. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా తల్లిదండ్రులు లేదా సంరక్షణ బాధ్యత కలిగిన వారు మాత్రమే తమ పిల్లలను తమ ఊర్లకు తీసుకొని వెళ్లాలని తెలిపారు.ఈ విషయమై హాస్టల్ వార్డెన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు