గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కథలు చెప్పడం, చదవడం, పుస్తకాలు చదివించడం, పుస్తకము పై సమీక్ష, స్పోకెన్ ఇంగ్లీష్ ,డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్, క్విజ్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సోమవారం రోజున ఉపాధ్యాయుడు ముత్యాలప్ప విద్యార్థులకు కథలు చెప్పడం జరిగిందని తెలిపారు. అనంతరం డాన్స్ ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్ లతోపాటు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రారంభమైన వేసవి శిక్షణ కార్యక్రమాలు..
RELATED ARTICLES