తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు బుధవారం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టగా అందులో పినరయి విజయన్ నివాసం కూడా ఒకటి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీఎంఆరఎల్) నుంచి ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ సంస్థకు రూ. 2.73 కోట్లు దక్కాయి. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. ఈ ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ విజయన్ కుమార్తె టీ వీణకు చెందిన కంపెనీ. రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ అవి మోసపూరితంగా ఉన్నాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎసఎఫఐఓ) తన అభియోగంలో పేర్కొంది. 2023 ఆగష్టులో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి 2020 మధ్యలో సీఎంఆరఎల్ నుంచి రూ.1.72 కోట్లు పొందినట్లు ఆ ఆరోపణలో పేర్కొన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు జరపాలని ఎసఎఫఐఓకు గతంలోనే కేంద్ర నుంచి ఆదేశాలు అందాయి. ఈ కేసులో విషయంలో వీణపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం నివాసం సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. కొయికోడ్‌లోని వీణ భర్త మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ నివాసంపైనా ఈడీ దాడులు జరిపింది.
పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు
- Advertisement -
RELATED ARTICLES


