Tuesday, February 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయితల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించాలి..

తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించాలి..

బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, దాత కలవల మహేష్
విశాలాంధ్ర ధర్మవరం; ప్రతి విద్యార్థిని తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డోలా రాజారెడ్డి, దాత కలవల మహేష్ విద్యార్థినిలకు పిలుపునిచ్చారు. స్థానిక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహణ సందర్భంగా దాతల సహాయ సహకారాలతో పాఠశాల ఉపాధ్యాయులుఅల్పాహారాన్ని అందిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథగా హాజరై తదుపరి డోలా రాజారెడ్డి మాట్లాడుతూ మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయుల విద్యార్థులకు స్టడీ అవర్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇందుకోసం దాతల సహాయ సహకారాలతో అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా దాత, బిజెపి నాయకులైన కలవల మహేష్ ను బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి పాఠశాల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. అనంతరం డోలా రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు 200 మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం ప్రశంసనీయమన్నారు. ప్రతి విద్యార్థిని త్వరలో జరగబోవు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాపతి, దాత కలవల మహేష్, ఉపాధ్యాయుల రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు