Wednesday, April 16, 2025
Homeజిల్లాలువిజయనగరంనాటుసారా నిర్మూలనకు కృషి

నాటుసారా నిర్మూలనకు కృషి

ఎంపీపీ అంబల్ల సుధారాణి

విశాలాంధ్ర – నెల్లిమర్ల : మండలంలోని నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సారా రహిత మండలంగా తీర్చిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీపీ, నవోదయం 2.0 కమిటీ చైర్ పర్సన్ అంబళ్ళ సుధారాణి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నవోదయం 2.0 కమిటీ సమావేశం ఎంపీపీ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు. నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు. నాటుసారా నిర్మూలనకు గ్రామ స్థాయి,కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. ముందుగా గ్రామాలలో నాటుసారా నిర్మూలనపై ప్రజ లకు అవగాహన కల్పించాలన్నారు. నాటు సారా తయారు చేయడంలో మార్పులు రాన ట్లయితే గ్రామాలలో తయారీదారులపై దాడులు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
ఎక్సైజ్ సీఐ వెంకట్రావు మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నాటు సారా నిర్మూలన చేస్తామన్నారు. మండలంలో ఎక్కడా సారా తయారీ లేదన్నారు. ఎవరైనా వినియోగిస్తే కమిటీకి సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో రైల్వే సలహా మండలి సభ్యులు అంబళ్ళ శ్రీరాములనాయుడు, ఎంపీడీఓ రామకృష్ణరాజు, ఏఎస్సై మూర్తి, డీటీ రవిశంకర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు