Sunday, March 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎస్టీ కాలనీలో విద్యుత్ వైర్లు తొలగింపునకు ప్రయత్నం

ఎస్టీ కాలనీలో విద్యుత్ వైర్లు తొలగింపునకు ప్రయత్నం

విద్యుత్ అధికారులకు ఎస్సీ ఎస్టీ గ్రామస్తులకు వాగ్వివాదం

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వైనం.
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని ధర్మపురి గ్రామములోని మిస్టరీ కాలనీలో విద్యుత్ బిల్లు అధికంగా ఆ గ్రామస్తులు లోని 40 మందికి పదివేల నుంచి 30 వేల వరకు రావడంతో, డబ్బులు కట్టలేకపోవడంతో రూరల్ ఏఈ జానకిరామయ్య ఉన్నతాధి అధికారుల ఆదేశాల మేరకు లైన్మెన్ వారి సిబ్బంది, విద్యుత్ వైర్లు తొలగించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో లైన్మెన్ తదితర సిబ్బంది మాట్లాడుతూ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము రావడం జరిగిందని మీరు వేల కొలది డబ్బులు గత పది సంవత్సరాలుగా కట్టడం లేదని తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్లు మాత్రమే ఉచితంగా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కానీ అనేక సంవత్సరాలుగా మీరు విద్యుత్ శాఖకు డబ్బులు కట్టకపోవడంతోనే తాము విద్యుత్ వైర్లను తొలగించేందుకు రావడం జరిగిందని తెలిపారు. నీతో గ్రామస్తులు విద్యుత్ అధికారులతో సిబ్బందితో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఫోన్ ఎక్కిన విద్యుత్ సిబ్బందిని బాధితులు అడ్డుకున్నారు. చివరకు విద్యుత్తు అధికారులు రూరల్ పోలీసులకు సమాచారం అందించిగా, హుటా హుటిన రూరల్ పోలీసులు చేరుకొని ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకోవడం సరికాదని, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా 200 యూనిట్లు కు పైగా వాడిన వారందరికీ నెల నెల కట్టమని చెప్పి ఉంటే బాగుండేదని, ఇప్పటికిప్పుడే వేలకొలది డబ్బులు కట్టమని, లేకపోతే విద్యుత్ వైర్లు తొలగిస్తామని చెప్పడం, బెదిరించడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి, అదనంగా వాడడం తప్పైనా, నెలవారీగా ఎందుకు వసూలు చేయలేకపోయినారని అధికారులను వారు ఇందుకు స్పందించిన రూరల్ ఏఈ జానకి రామయ్య మాట్లాడుతూ తమ లైన్మెన్లు గత కొన్ని సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారని, నిర్లక్ష్యంతో కట్టలేకపోవడంతో, విద్యుత్ ఎస్సీ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అసలే కరువుకాలం తినడానికి తిండి కూడా చాలా ఇబ్బందిగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తదుపరి విద్యుత్ శాఖ అధికారులు పోలీసులు బాధితులతో సమన్వయంతో మాట్లాడి నచ్చ చెప్పారు. ఏప్రిల్ 10వ తేదీ లోపల కొంత మొత్తం కడుతామని బాధితులు తెలపడంతో విద్యుత్ శాఖ అధికారులు రూరల్ పోలీసులు వెనుతిరిగి వెళ్లారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు