విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణములోని సిద్దయ్యగుట్ట సమీపంలో రైల్వే ట్రాక్పై శంకర గోవిందు (70 సంవత్సరాలు) దాటుతుండగా రైలు వచ్చేది గమనించలేకపోవడంతో రైలు ఢీకొని తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా హిందూపురం జి అర్ పి రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రి స్వామి మాట్లాడుతూ స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లి రైల్వే ట్రాక్ పై ఉన్న వ్యక్తిని చూసి 108కు ఫోన్ చేయగా, 108 సిబ్బంది పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించడం జరిగిందన్నారు. తదుపరి మృతిని కుమారుడు అన్నదమ్ములు శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చ్ రూముకు తరలించడం జరిగిందన్నారు. మృతుని తల్లి సిద్దయ్య గుట్టలో ఉన్నందున మాట్లాడి తిరిగి వచ్చే సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. పోస్ట్మాస్టర్ అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించడం జరిగిందన్నారు. అనంతరం హిందూపురం జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడు మృతి
RELATED ARTICLES