విద్యారంగ సమస్యలపై పోరాటల్లో ముందుండాలి
పిఎస్ యు జాతీయ కార్యదర్శి మహమ్మద్ షఫీఉల్లా
విశాలాంధ్ర ధర్మవరం; విద్యారంగా సమస్యలపై పోరాటల్లో ప్రగతిశీల విద్యార్థి సంఘం ముందువుందలని పిఎస్యు జాతీయ కార్యదర్శి మహమ్మద్ షఫీ ఉల్లా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ని ఎన్ జి వో హోంలో జరిగిన రెండవ రోజు రాష్ట్ర మహాసభ ముగింపు సమావేశం లో మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభించి తొమ్మిదినెలలు నెలల పూర్తి కావస్తుంది అని, నేటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులు కొరత కారణంగా చూపుతూ విద్యార్థులకు అందవలసిన తల్లికి వందనము స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం దారుణం అని అన్నారు. అలాగే యూజీసీ చేపడుతున్నావ్ ఉమ్మడి పీజీ సెట్ రద్దు చేయాలని ,ఆర్ ఎస్ పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు మాట్లాడుతూ రాష్ట్రములో అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించడం జరిగింది . నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మంజుల నరేంద్ర,సుబ్బరాయుడు ఉపాధ్యక్షులుగా సురేషు,చంద్ర సహాయ కార్యదర్శులుగా నరసింహ, అయ్యన్న కమిటీ సభ్యులుగా నందకిశోర్, గోపి, రాంచరణ్, ప్రసాద్, మురళి కేశవ, అఖిదానంద్ లను ఏకిగ్రీవంగా ఎన్నుకున్నారు.