Homeఅంతర్జాతీయంఏఐ కాదు ఎస్ఐ..ట్రంప్ బాటలో ఎలాన్ మస్క్..

ఏఐ కాదు ఎస్ఐ..ట్రంప్ బాటలో ఎలాన్ మస్క్..

- Advertisement -

తన స్పేస్‌ఎక్స్ఏఐ కంపెనీ పేరును స్పేస్‌ఎక్స్‌ఎస్ఐగా మార్చేందుకు అంగీకారం
ప్రభుత్వంలో ఏఐకి బదులు సూపర్ ఇంటెలిజెన్స్ వాడాలని ట్రంప్ ఆదేశాలు
మస్క్ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు

ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). మన దైనందిన జీవితంలో భాగమైపోయిన ఈ సాంకేతికత పేరును మార్చాలంటూ టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇకపై ఏఐకి బదులుగా ఎస్ఐ (సూపర్ ఇంటెలిజెన్స్) వాడాలని ఆయన సూచించారు. అంతేకాకుండా  తన ‘స్పేస్‌ఎక్స్ఏఐ’ (SpaceXAI) కంపెనీ పేరును ‘స్పేస్‌ఎక్స్‌ఎస్ఐ’ (SpaceXSI)గా మార్చేందుకు కూడా అంగీకారం తెలిపారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో “ఇక ఏఐ వద్దు” అంటూ మస్క్ ఒక చిన్న పోస్ట్ చేశారు. ఏఐ కన్నా ఎస్ఐ అనే పదం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మస్క్ పోస్ట్‌పై స్పందించిన ఒక యూజర్.. “అయితే స్పేస్‌ఎక్స్ఏఐ పేరును స్పేస్‌ఎక్స్‌ఎస్ఐగా మారుస్తారా?” అని ప్రశ్నించారు. దీనికి మస్క్ సానుకూలంగా స్పందిస్తూ “తప్పకుండా మారుస్తాం” అని బదులిచ్చారు.క్స్ఏఐ పేరును స్పేస్‌ఎక్స్‌ఎస్ఐగా మారుస్తారా?ఁ అని ప్రశ్నించారు. దీనికి మస్క్ సానుకూలంగా స్పందిస్తూ ఁతప్పకుండా మారుస్తాంఁ అని బదులిచ్చారు.

అయితే, మస్క్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 30న ట్రంప్ ఒక కీలక కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) జారీ చేశారు. దాని ప్రకారం అమెరికా ప్రభుత్వ అధికారిక కమ్యూనికేషన్లలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పదానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదాన్నే వాడాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీల అసలైన సామర్థ్యాలను ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదమే సరిగ్గా ప్రతిబింబిస్తుందని ఆ ఉత్తర్వులకు సంబంధించిన ఫ్యాక్ట్‌షీట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇటీవలే ప్రముఖ ఏఐ కంపెనీల అధినేతలతో జరిగిన సమావేశంలో కూడా ఈ కొత్త పేరును వాడాలని ట్రంప్ వారిని కోరారు. ట్రంప్ ఆదేశాల తర్వాతే మస్క్ ఈ దిశగా స్పందించడం గమనార్హం.

మస్క్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్ల నుంచి దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. “ఏఐకి మంచి రోజులు ముగిశాయి” అని ఒకరు కామెంట్ చేయగా, “ఇది ఎప్పటికీ ఏఐనే, పేరు మార్చినంత మాత్రాన ఏమీ మారదు” అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. మరికొందరు “ఇక స్పేస్‌ఎక్స్ఏఐ పేరును స్పేస్‌ఎక్స్‌ఎస్ఐగా మార్చాల్సిన సమయం వచ్చింది” అంటూ మస్క్‌కు మద్దతు తెలిపారు. మొత్తం మీద టెక్నాలజీ రంగంలో ఈ కొత్త పేరు మార్పు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు