టెక్ దిగ్గజం, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి తన స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన ఒక్కో షేర్‌ను వచ్చే ఏడాది ఉచితంగా ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.వచ్చే ఏడాది, అమెరికాలోని ప్రతి చిన్నారికి నా స్పేస్ఎక్స్ షేర్లలో ఒకదాన్ని ఇస్తాను. ఇలాంటి వాటిలో ఇది మొదటిది మాత్రమే అని మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.2026 జూన్‌లో స్పేస్ఎక్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి వచ్చిన సుమారు నాలుగు నెలల తర్వాత మస్క్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, ఈ షేర్ల పంపిణీ ఎలా జరుగుతుంది, అర్హత ప్రమాణాలు ఏమిటి అనే వివరాలను ఆయన వెల్లడించలేదు. షేర్లను నేరుగా పిల్లలకే ఇస్తారా? లేదా వారి తల్లిదండ్రులు, సంరక్షకుల ఆధ్వర్యంలోని ఖాతాలలో జమ చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ప్రస్తుత అంచనాల ప్రకారం.. అమెరికాలో 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సుమారు 72 మిలియన్ల మంది ఉన్నారు. ఇటీవల స్పేస్ఎక్స్ షేరు విలువ 146 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కన, మస్క్ ప్రకటించిన ఈ భారీ పథకానికి దాదాపు 10.5 బిలియన్ డాలర్లు (రూ. 99,707కోట్లు) ఖర్చవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బృహత్తర పథకం అమలుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. అమెరికాలోని ప్రతి చిన్నారికీ ఉచితంగా స్పేస్ఎక్స్ షేర్
- Advertisement -
RELATED ARTICLES


