విశాలాంధ్ర.విజయనగరం జిల్లా.రాజాం : గుండె జబ్బుల మరణాలను నివారించేందుకు రాజాం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కరణం హరిబాబు మంగళవారం తెలిపారు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి మొదటి గంటలోపే రూ.45వేలు విలువైన టెనెక్టిప్లస్ ఇంజెక్షన్‌ను ఉచితంగా అందించుతామన్నారు. ఆసుపత్రిలో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.