త్వరలో అందుబాటులోకి రానున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ 3.0) వెర్షన్
ఈపీఎఫ్ఓలో కీలక మార్పుల గురించి వివరించిన కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
కానున్నాయి. ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్లు, డిజిటల్ కరెక్షన్లు, ఏటీఎం ద్వారా నగదు తీసుకోవడం వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈపీఎఫ్ఓ కొత్త వెర్షన్ గురించి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వివరించారు. ప్రముఖ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి మాండవీయ ఈపీఎఫ్ఓలో డిజిటల్‌గా కీలక మార్పులు చేయబోతున్నట్లు వెల్లడించారు. 3.0 వెర్షన్‌తో తొమ్మిది కోట్ల మంది చందాదారులకు ఉపయోగం కలుగుతుందని ఆయన చెప్పారు. మే లేదా జూన్ నెలాఖరు నాటికి కొత్త వెర్షన్ అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్లెయిమ్‌లు, కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు తొలగిపోతాయని కేంద్ర మంత్రి వివరించారు.
ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు
RELATED ARTICLES