Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రాప్ లోన్ రెన్యువల్ పరంగా ఇబ్బంది లేకుండా ఇవ్వండి..

క్రాప్ లోన్ రెన్యువల్ పరంగా ఇబ్బంది లేకుండా ఇవ్వండి..

- Advertisement -

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం /ముదిగుబ్బ;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో గల రైతులకు క్రాఫ్ లోన్ రెన్యువల్ పరంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెన్యువల్ చేయాలని ముదుగుబ్బా సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ మేనేజర్ తో చర్చలు జరిపి అనంతరం వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సిపిఐ పార్టీ నాయకులు, పలువురు రైతులు ఆ బ్యాంకు మేనేజర్ ను కలిసి
పంట రుణాల రెన్యువల్ పరంగా రైతులు పడుతున్న వివిధ రకాల ఇబ్బందులను మేనేజర్ కు వివరించడం జరిగిందన్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఫ్రీ హోల్డ్,రీ సర్వే, డీకేటి, తదితర భూముల రెన్యువల్ విషయంలో కఠిన నిబంధనల పేరుతో ఆ రైతుల లోన్లు రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు, ఆయా భూముల రికార్డుల పరంగా రెవెన్యూ వారు అధికారికంగా సంతకాలు చేసి వన్ బి పేపర్లు ఇస్తున్న అవేమీపట్టించుకోకుండా బ్యాంకు వారు ఆయా భూముల వివరాలు తమ బ్యాంకు వెబ్ ల్యాండ్ లో కనిపించలేదని, తమ
పై అధికారుల నుంచి అనుమతి లేదనే తదితర కారణంతో ఆ రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్న కేవలం రెండు లక్షలు మాత్రమే రుణం ఇస్తామని నిబంధన పెడుతుండడమే కాక ఇంతకుముందు
ఆ భూములపై రెండు లక్షల పైన లోను తీసుకొని ఉంటే ఆ రుణాన్ని కూడా వెనక్కి చెల్లించాలని లేదంటే రెన్యువల్ చేయలేమని చెబుతూ రైతులను ఇబ్బంది పెట్టడం సబబు కాదని మేనేజర్ తో వాదించారు, ఇదిలా ఉండగా క్రాప్ లోన్ రెన్యువల్ చేయాలంటే సంబంధిత రైతు ఇతర బ్యాంకుల్లో ఎక్కడైనా గోల్డ్ లోను తీసుకుని ఉంటే తక్షణమే ఆ గోల్డ్ అక్కడ విడిపించి ఆ లోన్ కూడా తమ బ్యాంకు లోనే తీసుకోవాలని కెనరా బ్యాంక్ వారు తెలపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు, అదేవిధంగా క్రాప్ లోన్ రెన్యువల్ కు అవసరమయ్యే బాండ్లను కూడా రైతులు అధిక ధరలు చెల్లించి బయట కొనుగోలు చేయకుండా బ్యాంకు వారే ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు, రుణాల రెన్యువల్ కు సంబంధించి చిన్న చిన్న విషయాలకు తరచూ రైతులను బ్యాంకు చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో వారి పంట రుణాలను రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేసామన్నారు. ఏది ఏమైనా అన్ని రకాల భూములకు సంబంధించిన పంట రుణాలను రెన్యువల్ చేయడమే గాక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తగినంత రుణాన్ని కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.కాగా ఫ్రీ హోల్డ్, రీ సర్వే, తదితర భూముల రుణం మంజూరు విషయాన్ని తమ పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో త్వరలోనే కెనరా బ్యాంక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు