శ్రీ లలితా నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ, రామలాలిత్యా
విశాలాంధ్ర ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల వేడుకల కార్యక్రమములో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ రామ లాలిత్య శిష్య బృందం వారి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గురువులు వారి శిష్య బృందం 20 మంది పాల్గొని భరతనాట్యం, కూచిపూడి, నరసింహ స్వామి చరితం, ప్రహల్లాద పట్టాభిషేకము లాంటి నాట్యాలను ప్రదర్శించిన తీరు అందర్నీ ముగ్ధుల్ని చేసింది. అనంతరం వీరి ప్రదర్శనను ఆలయ ఈవో శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించి అందరిని ఘనంగా సత్కరిస్తూ మెమొంటోలను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గురువులు మాట్లాడుతూ కదిరి బ్రహ్మోత్సవాల్లో మాకు ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన ఈవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
RELATED ARTICLES