విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాంస్కృతిక మండలి లో మానస డాన్స్, కల్చరల్ సంఘం తరఫున రంగ ప్రవేశాన్ని డాన్స్ మాస్టర్ మానస ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ రంగ ప్రవేశంలో కూచిపూడి, భరతనాట్యం, పూర్వ రంగం, రాయలసీమ, సాంప్రదాయ బద్దం లాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చిన వైనం అందరిని ఆకట్టుకుంది. మొత్తం ఈ రంగ ప్రవేశంలో 10 అంశాలపై ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నది. ఆర్కెస్ట్రా తో కూడిన నాట్య ప్రదర్శన ముగ్ధుల్ని చేసింది. నర్తకి మనులుగా వైష్ణవి, తనుశ్రీ, కీర్తిశ్రీ ,యశస్విని, సాహిత్య శేఖర్, మధు హాసిని, మౌనిక, మోక్ష ప్రియ తమదైన శైలిలో ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథు లైన పెద్దిరెడ్డి సత్య కృపా కాలేజ్ ప్రిన్సిపాల్, ఏం పల్లవి కూచిపూడి నాట్యా చారిని నెల్లూరు, హనీషా చౌదరి విజయవాడ, శైలజ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు హైదరాబాద్ వారి చేతులు మీదుగా నర్తకి మనలను ఘనంగా సన్మానిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం మానస నృత్య కళాకేంద్రం ఎస్బిఐ కాలనీ ధర్మవరం కు చెందిన డాక్టర్ ఆర్. మానస నిర్వహించడం పట్ల ముఖ్య అతిథులు, విచ్చేసిన నర్తకి మనుల తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
అలరించిన మానస డాన్స్, కల్చరల్ కార్యక్రమాలు
RELATED ARTICLES