Friday, December 27, 2024
Homeజిల్లాలుఅనంతపురంపరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలి

పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలి

శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి)
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 53వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, డి ఐ ఈ పి ఓ సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) మాట్లాడుతూ… జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో 2020 -23 మరియు 2023- 27 పరిశ్రమల పాలసీలో 15 యూనిట్లకు గాను 239.45 లక్షల రూపాయల సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలిపారు. సింగిల్ విండో పోర్టల్ లో పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న అనుమతులను నిర్ణీత సమయంలో ఆమోదించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు ఫ్యాక్టరీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 64 పరిశ్రమలకు స్టాటిటరి నోటీసులు ఇవ్వడం జరగగా, వాటికి సంబంధించిన రిపోర్టులను అందించాలన్నారు. జిల్లాలో 89,500 ఎం‌ఎస్‌ఎం‌ఈలు వుంటే కేవలం 14,000 ఎం‌ఎస్‌ఎం‌ఈలు సర్వే చేయటం జరిగిందని, ఇప్పటివరకు 18 శాతం మాత్రమే సర్వే పూర్తిచేయటం జరిగిందని జనవరి నెలాఖరిలోగా సర్వే పూర్తి చేసేలా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి జీఎం.శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, కమర్షియల్ టాక్సెస్ డిప్యూటీ కమిషనర్ మురళి మనోహర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, ఎల్డిఎం నర్సింగరావు, డిటిసి వీర్రాజు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రామసుబ్బారెడ్డి, జెడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, సోషల్ వెల్ఫేర్ జెడి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, మార్కెటింగ్ ఎడి సత్యనారాయణ చౌదరి, డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, మైన్స్ డిడి వెంకటేశ్వర్లు, ఖాదీ ఏడీ వెంకట్రావు, ఏపీపీసీబీ అనలిస్టు ఉమామహేశ్వరి, ఫ్యాక్టరీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఏపీఐఐసీ మేనేజర్ మల్లికార్జున, నాబార్డ్ ఏజీఎం అనురాధ, ఏపీఎస్ఎఫ్సి బిఎం మహేష్, డిపిఓ నాగరాజు నాయుడు, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, డిఎస్డిఓ ప్రతాపరెడ్డి, ఆయా శాఖల అధికారులు, పలువురు మెంబర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు