Tuesday, April 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేయండి..

ధర్మవరంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేయండి..

ఎస్ఎఫ్ఐ అండ్ సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మారంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ సిఐటియు నాయకులు ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సిఐటియు నాయకులు మాట్లాడుతూ పట్టణంలో అనేకమంది పేద బడుగు బలహీన వర్గాలు చేనేత కార్మికులు, రైతులు ప్రజలు నిత్యం రక్తం కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారని, అనారోగ్య దీర్ఘకాలిక జబ్బులకు రక్తం ఎంతో అవసరం ఉందని వారు తెలిపారు. కావున ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్తనిధిని ఏర్పాటు చేయాలని తెలిపారు. భవిష్యత్తులో ధర్మవరంలో ఈ ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు, కుల సంఘాలు ఐక్యమై బ్లడ్ బ్యాంక్ సాపనీకై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవి రమణ, ఆదినారాయణ, నామాల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు