Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచలివేంద్రాల ఏర్పాటు ప్రజలకు దాహార్తిని తీరుస్తుంది

చలివేంద్రాల ఏర్పాటు ప్రజలకు దాహార్తిని తీరుస్తుంది

సి ఎస్ డి టి ఈశ్వరయ్య
విశాలాంధ్ర ధర్మవరం : చలివేంద్రాల ఏర్పాటు ప్రజలకు దాహార్తిని తీరుస్తుందని సిఎస్డిటి ఈశ్వరయ్య తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయ ఆవరణం పక్కన గల మండల కన్జ్యూమర్ ఫోరం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని సిఎస్డిటి ఈశ్వరయ్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల కార్యాలయమునకు గ్రామ పట్టణ ప్రజల నుండి ఎంతోమంది వ్యక్తులు వస్తూ ఉంటారని, ఈ చలివేంద్రం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తదుపరి కన్జ్యూమర్ ఫోరం వారిని సిఎస్డిటి అభినందించారు.పట్టణంలో మరిన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. దాతలు ముందుకు వస్తే ఇవి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు గోవిందు, గౌరవ అధ్యక్షులు కుల్లాయప్ప, కార్యదర్శి కాకుమాని రవీంద్ర, కోశాధికారి శుభాన్, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు