ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జే.రాజారెడ్డి
విశాలాంధ్ర -అనంతపురం : అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ కి రూ15 వేలు ఇవ్వాల్సిందే అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జే.రాజారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం ఆటో డ్రైవర్స్ యూనియన్ నగర రెండవ మహాసభ ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. మల్లికార్జున అధ్యక్షతన ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద నుండి టవర్ క్లాక్ సప్తగిరి ఐరన్ బ్రిడ్జి మీదుగా సిపిఐ జిల్లాల కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య ఆహ్వానితులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆటో డ్రైవర్లకు 15000 రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 894 గేజిట్ ను రిలీజ్ చేసి భారీగా రవాణా రంగ కార్మికులపై అపరాధ రుసుములు వేస్తున్నారు అన్నారు తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల పై పోలీస్ ఆర్టిఏ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు .
స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద మహిళా ఆటో డ్రైవర్లు డివైడర్ల కారణంగా జీవనోపాధికి ఇబ్బందిగా మారిన డివైడర్లను తక్షణమే తొలగించాలన్నారు. ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫామ్ వేసుకోవాలని లైసెన్స్ పొందాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ నగర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణుడు చిరంజీవి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజు నగర ప్రధాన కార్యదర్శి కృష్ణ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర దుర్గాప్రసాద్ జిల్లా ట్రెజరర్ సురేష్ బాబు రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు సిద్ధ మహిళా ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు భాగ్యలక్ష్మి అస్మత్ ఆటో యూనియన్ నాయకులు రఘు భాషా నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణా నాయక్ సహాయ కార్యదర్శిలుగా కాజా నరసింహ ఉపాధ్యక్షులుగా రఘు భాష ట్రెజరర్ గా అస్మత్ విను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
అనంతపురం ఆటో డ్రైవర్స్ యూనియన్ నగర రెండవ మహాసభ ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏ మల్లికార్జున అధ్యక్షతన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద నుండి టవర్ క్లాక్ సప్తగిరి ఐరన్ బ్రిడ్జి మీదుగా సిపిఐ జిల్లాల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మహాసభ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య ఆహ్వానితులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 894 గేజిట్ ను రిలీజ్ చేసి భారీగా రవాణా రంగ కార్మికులపై అపరాధ రుసుములు వేస్తున్నారు అన్నారు తక్షణమే
ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల పై పోలీస్ ఆర్టిఏ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. .
స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద మహిళా ఆటో డ్రైవర్లు డివైడర్ల కారణంగా జీవనోపాధికి ఇబ్బందిగా మారిన డివైడర్లను తక్షణమే తొలగించాలన్నారు. ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫామ్ వేసుకోవాలని లైసెన్స్ పొందాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్, నగర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణుడు, చిరంజీవి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజు, నగర ప్రధాన కార్యదర్శి కృష్ణ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర, దుర్గాప్రసాద్, జిల్లా ట్రెజరర్ సురేష్ బాబు, రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, సిద్ధ మహిళా ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు భాగ్యలక్ష్మి,అస్మత్ ఆటో యూనియన్ నాయకులు రఘు,భాషా,నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా దుర్గాప్రసాద్,ప్రధాన కార్యదర్శిగా కృష్ణా నాయక్, సహాయ కార్యదర్శిలుగా ఖజా నరసింహ ఉపాధ్యక్షులుగా రఘ, భాష, ట్రెజరర్ గా అస్మత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.