Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి బాలిక అకుంఠిత దీక్ష తో ముందుకు వెళ్లాలి..

ప్రతి బాలిక అకుంఠిత దీక్ష తో ముందుకు వెళ్లాలి..

కళాశాల కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి బాలిక అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్లాలని, అప్పుడే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని కళాశాల కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికల హక్కులు, విద్య, ఆరోగ్య, భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లింగ పక్షపాతాలను తొలిగిస్తూ.. బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నారని తెలిపారు. బాలికలపై సమాజంలో ఉన్న వివక్షను దూరం చేయడానికి, వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించడమే దీని ప్రధాన లక్ష్యమని అన్నారు. తొలుత వారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ జనవరి 24న ప్రమాణ స్వీకారం చేయటం జరిగిందని, అలానే స్త్రీ&శిశు సంక్షేమ శాఖ కూడా 24జనవరి 2008 న ఏర్పాటు చేయటం జరిగిందని అందువలనే నేడు జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. నేటి సమాజం బాలికలు అంటే చిన్నచూపు చూస్తున్నది అని,ఇప్పటికాలంలో కూడా అదికొనసాగుతుండటం చాలా బాధాకరమైన విషయం అని, రాబోయే కాలంలో ఆడా,మగా భేధంలేకుండా అందరూ సమానంగా ఉండేలా కృషి చేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు