రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి వైద్య విద్యార్థి పేదలకు సేవ చేసే గుణమును అలవర్చుకోవాలని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు కర్నూలు లోని వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పూర్వ విద్యార్థుల సదస్సుకు మాజీ హోం శాఖ మంత్రి మైసూరా రెడ్డి హాజరు కావడం జరిగింది.అనంతరం అక్కడ హాజరైన 700 మంది పూర్వ విద్యార్థులతో కంటి సమస్యలు వాటి నివారణ అంశంతో పలు విషయాలను తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ కంప్యూటర్ వినియోగంలో నేడు యువతి యువకులు ఎక్కువ సమయానికి కేటాయిస్తున్నారని, దీనివల్ల కంటికి విరామం లేకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. కంటికి పని చెప్పినప్పుడు విరామం అప్పుడప్పుడు ఇవ్వాలని తెలిపారు. కంటి సమస్యలను నివారించుటలో పలు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని, లేనియెడల కన్ను పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉంటుందని తెలియజేశారు. కంటికి తప్పనిసరిగా విరామం ఇవ్వాలని, శ్రమతో కూడిన కంటితో చేయబోయే పనులలో కన్ను తడారిపోయి, సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. కృత్రిమంగా తయారు చేసే డ్రాప్స్ ను అప్పుడప్పుడు వాడాలని, కంటి పట్ల నిర్లక్ష్యం ఉండకుండా ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు అందించుకోవాలని తెలిపారు. అనంతరం డాక్టర్ నరసింహులు పూర్వ విద్యార్థులు మెమొంటో ఇస్తూ ఘనంగా సత్కరించారు.
ప్రతి వైద్య విద్యార్థి పేదలకు సేవ చేసే గుణమును అలవర్చుకోవాలి..
RELATED ARTICLES