Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి వ్యక్తికి వ్యాయామం, యోగాసనాలు, ఆటలు అవసరం..

ప్రతి వ్యక్తికి వ్యాయామం, యోగాసనాలు, ఆటలు అవసరం..

జిల్లా సంఘ చాలక్ ఎస్ రామాంజనేయులు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వ్యక్తికి వ్యాయామం, యోగాసనాలు, ఆటలు ఎంతో అవసరమని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ ఎస్.రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని శివరామ నగర్ లో గల భగవాన్ శ్రీ జిహేశ్వర భజన మందిరంలో ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు మూడు రోజులపాటు ప్రారంభిక వర్గ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి వివేకానంద, నేతాజీ, బాలగంగాధర్ తిలక్, డాక్టర్ జి, డాక్టర్ అబ్దుల్ కలాం మొదలగు మహనీయుల ఆశయ ఆకాంక్షలను, నిజం చేయుటకు నేటి యువత వ్యక్తిగత జీవితమునకు మానసిక శారీరక శిక్షణ ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఈ శిక్షణకు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరముల వయసు ఉన్నవారు మాత్రమే పాల్గొనాలని తెలిపారు. ఈ మూడు రోజులు నిత్యావసర వస్తువులు వెంట తీసుకొని రావలెనని తెలిపారు. శారీరక, మానసిక వికాసమునకు, దేశభక్తిని పెంపొందించుటకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు అరవింద్ సెల్ నెంబర్ 9441391910 లేదా నరసింహులు సెల్ నెంబర్ 8885823392 కు సంప్రదించాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు