అగ్నిమాపక అధికారి యు. రాజు
విశాలాంధ్ర ధర్మవరం:; అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి యు. రాజు తెలిపారు. ఈ సందర్భంగా మూడవరోజు అగ్నిమాపక అధికారి రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని జేఆర్ సిల్క్ నందు పనిచేస్తున్న సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణ లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డెమో ద్వారా చూపించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గ్యాస్ ఉపయోగములు తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి, ప్రమాద నివారణ గూర్చి తెలియజేయడం జరిగిందన్నారు.అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారించే పద్ధతుల తెలిపే కరపత్రాలను కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు జిల్లా అధికారుల ఆదేశాలమేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వంట చేసేటప్పుడు సరియైన నూలు బట్టలు ఏఫ్రాన్ దుస్తులు ధరించాలని తెలిపారు. ప్రమాదవశాత్తు మీ బట్టలకు నిప్పు అంటుకుంటే భయంతో పరిగెత్తవద్దని, నేలపై దొర్లి, దుప్పటి లేదా కోటు లేదా పెద్ద టవల్ను చుట్టుకోండి అని తెలిపారు. మీ చుట్టుపక్కల అగ్ని ప్రమాదం జరిగితే ప్రతి ఒక్కరూ ఆరు బయటకు వెంటనే సురక్షితంగా రావాలని తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విలువైన వస్తువులు గూర్చి సమయాన్ని వృధా చేసుకోకుండా వాటి కొరకై తిరిగి లోనికి ప్రవేశించరాదని తెలిపారు. విద్యుత్ పరికరాలకు నిప్పంటుకున్నప్పుడు నీళ్లతో ఆర్పవద్దని దీనివల్ల కరెంటు షాక్ కు తగిలి ప్రాణాపాయము కలగవచ్చునని తెలిపారు. అలా కాకుండా వెంటనే కరెంటును ఆఫ్ చేయాలని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పట్టణ అగ్నిమాపక కేంద్రానికి గాని 101 కు సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి..
RELATED ARTICLES