Saturday, February 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసేవా భావాలను అందరూ అలవర్చుకోవాలి

సేవా భావాలను అందరూ అలవర్చుకోవాలి

శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: సేవా భావాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు 380 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వైద్యులు, నర్సుల చేతులు మీదుగా పంపిణీ చేశారు. అంతేకాకుండా గర్భిణీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. అనంతరం కన్వీనర్ నామ ప్రసాద్ మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకెంతో తృప్తిని ఇస్తుందని తెలిపారు. నేటి ఈ సేవా కార్యక్రమానికి శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులే దాతలుగా వ్యవహరించారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న ఇటువంటి సేవలు ఎందరికో స్ఫూర్తిని ఇస్తాయని, దాతలు కూడా ముందుకు రావలసిన బాధ్యత ఉందని వారు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరంలాగా మారాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు