ప్రధాన అర్చకులు- దేవరకొండ గణేష్ శాస్త్రి
విశాలాంధ్ర ధర్మవరం:: హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని గౌరవించినప్పుడే అందరికీ శుభదాయకంగా ఉంటుందని ప్రధాన అర్చకులు దేవరకొండ గణేష్ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని చెరువు కట్ట మొదటి గుడి అయినా శ్రీ చక్ర సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు శ్రీ చక్ర సమేత కాశీ విశ్వనాథ స్వామి అన్నపూర్ణేశ్వరీ దేవి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆలయ నిర్వాహకులు హట్టి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గణేష్ శర్మతో పాటు శిష్య బృందం యశ్వంత్ శర్మ, హితేష్ శర్మ, వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హట్టి కుటుంబ సభ్యులతో ఈ కళ్యాణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కళ్యాణ వేడుకలను తిలకించడానికి వందలాదిమంది భక్తాదులు, పట్టణ ప్రజలు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి దాదాపుగా 500 మందికి పైగా భక్తాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుల హట్టి కుటుంబ సభ్యులు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి..
RELATED ARTICLES